రేషన్​ కార్డు ఉన్నవారికే ఫ్రీ బస్​ జర్నీ

బాల్కొండ, వెలుగు : తెల్లరేషన్​ కార్డు ఉన్న మహిళలకే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని వర్తింపజేయాలని ధర్మ సమాజ్ పార్టీ లీడర్లు గురువారం బాల్కొండ ఎమ్మార్వో శ్రీధర్​కు వినతిపత్రం అందజేశారు.

తమ జీవనోపాధిని కోల్పోయిన ఆటో డ్రైవర్లకు నెలకు రూ.3,000  భృతి ఇచ్చి, వారి కుటుంబాలను ఆదు కోవాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ నిశాంత్ మహారాజ్,లీడర్లు ఆత్మ గౌరవ్, క్రాంతి కిరణ్, నితీష్, తరుణ్, కార్తీక్ పాల్గొన్నారు.