బస్ లో పుట్టిన చిన్నారికి ఫ్రీ బస్ పాస్

బస్ లో పుట్టిన చిన్నారికి ఫ్రీ బస్ పాస్
  • ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడి 
  • డెలివరీ చేసిన వారికి నగదు అందజేత

 హైదరాబాద్, వెలుగు: రాఖీ పండగ రోజు గద్వాల డిపో ఆర్టీసీ బస్సులో జన్మించిన చిన్నారికి జీవిత కాలం పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణిం చాలా బస్ పాస్ ను అందించామని టీజీఎస్ఆర్టీసీపై కటించింది. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్ లలో పుట్టిన పిల్లలకు జీవితకాలపు ఉచిత బస్ పాస్ ను ఇవ్వాలన్న నిర్ణయం మేరకు ఆ చిన్నారికి బర్త్ డే గిఫ్ట్ గా లైఫ్ టైం ఫ్రీ బస్ పాస్ ను మంజూరు చేశామని సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. అలాగే, కండక్టర్తో పాటు గర్భిణీ డెలివరికి సాయం చేసిన వనపర్తిలోని మదర్ అండ్ చైల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్ నర్స్ అలివేలు మంగమ్మకు డీలక్స్, సూపర్ లగ్జరీ సర్వీసు ల్లోనూ ఏడాదిపాటు ఉచితంగా బస్ పాసు సంస్థ అందించింది. 

బస్ కండక్టర్ భారతి, డ్రైవర్ అంజితో పాటు నర్చు అలివేలు మంగమ్మను బస్భవన్ లో మంగళవారం యాజమాన్యం సత్కరించింది. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి ఎండీ సజ్జనర్ వారిని ఘనంగా సన్మానించి.. నగదు బహుమతి అందజేశా < రు. చిన్నారి ఉచిత బస్ పాసుగర్వాల డిపోమేనేజర్ మురళీకృష్ణడు అందజేశారు. కార్యక్రమంలో సంస్థ సీవోవోడా క్టర్ రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ముని శేఖర్. కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు.