వేములవాడ: రేపు మహా శివరాత్రి పండుగను పురస్కరించుకొని భక్తులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ఆర్టీసీ. తెలంగాణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న దేవాలయాన్ని దర్శించుకునే భక్తులకు ఫ్రీ బస్సు సదుపాయం కల్పిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. అయితే ఈ సదుపాయం వేములవాడ బస్ స్టాప్ నుంచి రాజన్న టెంపుల్ వరకు ఉంటుందన్నారు. మొత్తం 14 మినీ బస్సులు ఏర్పాటు చేశామని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కాగా.. ఈ రోజు నుంచి వేములవాడ రాజన్న దేవాలయంలో శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరుగనున్న ఈ ఉత్సవాల్లో.. దాదాపు 4 లక్షల మంది వరకు భక్తులు వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.
రాజన్న జాతరకు #TSRTCFreeBus ఉచిత బస్సు సదుపాయం కలదు. #Mahashivratri జాతరకు విచ్చేయుచున్నభక్తులకు స్వాగతం, సుస్వాగతం.
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) February 28, 2022
14 mini buses has arranged on special hire to temple authorities for operating as free shuttles between our bus stand & temple for the convenience of devotees pic.twitter.com/fSIDw3Vvum
మరికొన్ని వార్తల కోసం: