బల్దియా ఉద్యోగులు, సిబ్బందికి అక్టోబర్ 8న క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు

బల్దియా ఉద్యోగులు, సిబ్బందికి అక్టోబర్ 8న క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు

హైదరాబాద్ సిటీ, వెలుగు: బల్దియా ఉద్యోగులు, కార్మికుల కోసం మంగళవారం జీహెచ్ఎంసీ హెడాఫీసులో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించనున్నట్లు కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. కిమ్స్, సన్ షైన్ హాస్పిటల్ సహకారంతో డాక్టర్ విమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో క్యాంప్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

 ఆల్ట్రాసౌండ్, ఎండోస్కొపీ, ఈసీజీ, 2డీ- ఎకో, ఎక్స్ రే, సీబీపీ, లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, సీరం క్రియాటిన్, లిపిడ్ ప్రొఫైల్ తదితర పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ప్రతి సర్కిల్, జోనల్ ఆఫీసుల నుంచి అనారోగ్యంతో బాధ పడుతున్న, అవసరమైన10 మందిని పంపించాలని కమిషనర్ ఆదేశించారు. ఏమీ తినకుండా రావాలని సూచించారు.