
ములుగు, వెలుగు: ప్రతి సోమ, మంగళ, బుధవారాల్లో మహిళలకు ఉచితంగా క్యాన్సర్ టెస్ట్‌లు నిర్వహించనున్నట్లు ములుగు అడిషనల్ కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రకటించారు. గురువారం కలెక్టరేట్‌లో వైద్య, ఆరోగ్య శాఖ ఆఫీసర్లతో నిర్వహించిన రివ్యూలో ఆమె మాట్లాడారు. ఏటూరునాగారం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో టెస్టులు చేయనున్నట్లు తెలిపారు.
35 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలు, క్యాన్సర్ లక్షణాలు కనిపించిన వారితో పాటు, పొగాకు, గుట్కా అలవాటు ఉన్న వారు టెస్టులు చేయించుకోవాలని సూచించారు. సమావేశంలో డీపీవో వెంకయ్య, వైద్య ఆరోగ్య శాఖ ఆఫీసర్లు, ప్రతిమ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.