
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు విజేత స్టడీ సర్కిల్ డైరెక్టర్ వీజే రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లోని ‘విజేత స్టడీ సర్కిల్’లో ఎస్‌ఎస్‌సీ (సీజీఎల్/సీహెచ్‌ఎస్‌ఎల్), బ్యాంక్ (పీవో, క్లర్క్), రైల్వే తదితర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్ల కోసం ఎన్‌ఆర్‌ఐల సహాయంతో ఫ్రీ ఇన్సెంటివ్ కోచింగ్ ఇవ్వనున్నట్లు గురువారం తెలిపారు.
అర్హులైనవారు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, సంబంధిత సర్టిఫికెట్లతో ఈ నెల 19 వరకు స్టడీ సర్కిల్‌లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు దిల్‌సుఖ్‌నగర్‌లోని విజేత స్టడీ సర్కిల్‌లో సంప్రదించాలన్నారు. అలాగే, 99084 70999, 99084 80999, 92461 10224 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.