నల్గొండ అర్బన్, వెలుగు : గ్రూప్ 1,2,3,4, బ్యాంకింగ్, ఆర్ఆర్ బీ, ఎస్ఎస్సీ, రాష్ట్ర, కేంద్ర స్థాయి ఉద్యోగాల కోసం ప్రిపేర్అయ్యే అభ్యర్థులకు ఫౌండేషన్ కోర్సు ద్వారా మూడు నెలలపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధికారి ఎల్. శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 28న నల్గొండ పట్టణంలోని విశ్వదీప్ విద్యాపీఠ్ హైస్కూల్ లో స్పాట్ అడ్మిషన్లు జరగనున్నట్లు తెలిపారు.
డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు హాస్టల్వసతితోపాటు శిక్షణ ఇస్తామని తెలిపారు. పూర్తి వివరాల కోసం 8465035932 , 9010895239 నంబర్లను సంప్రదించాలని సూచించారు.