
హైదరాబాద్, వెలుగు: విద్యుత్ శాఖ నోటిఫికేషన్ ఇచ్చిన జూనియర్ లైన్‌మెన్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఎన్. బాలాచారి తెలిపారు. ఈ నెల 23 నుంచి 30 వరకు www.studycircle.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నవంబర్ మొదటి వారంలో క్లాసులు ప్రారంభమవుతాయని చెప్పారు.