కామారెడ్డి టౌన్, వెలుగు : టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్–1 ఎగ్జామ్రాసే వారి కోసం బీసీ స్టడీ సర్కిల్నిజామాబాద్ఆధ్వర్యంలో ఫ్రీ కోచింగ్ఇవ్వనున్నట్లు స్టడీ సెంటర్డైరెక్టర్సీ.హెచ్. వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన అర్హులైన అభ్యర్థులు
ఈ నెల 7లోగా నిజామాబాద్‌లోని సుభాష్‌నగర్‌లో ఉన్న బీసీ స్టడీ సర్కిల్లో అప్లికేషన్లు అందజేయాలన్నారు. ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ, క్యాస్ట్, ఇన్కమ్, గ్రూప్-1కు అప్లికేషన్, ఆధార్, 2 పాస్‌పోర్ట్‌సైజు ఫోటోలను అప్లికేషన్‌కు జతచేయాలన్నారు. ఇతర వివరాల కోసం 08462– 241055కు సంప్రదించాలని సూచించారు.