గ్రూప్ 1 మెయిన్స్ ఉచిత శిక్షణకు అప్లై చేసుకోండి

గ్రూప్ 1 మెయిన్స్ ఉచిత శిక్షణకు అప్లై చేసుకోండి
  • వికారాబాద్ మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి హనుమంతరావు

వికారాబాద్, వెలుగు :  రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్ గ్రూప్1 మెయిన్స్ కు ఉచిత శిక్షణ అందిస్తుండగా.. అర్హులైన అభ్యర్థులు ఈ నెల19 లోగా అప్లై చేసుకోవాలని వికారాబాద్ జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ అధికారి హనుమంతరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అర్హులైన మైనారిటీ ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్ మూడో ఫ్లోర్, జామియా నిజామియా కాంప్లెక్స్ , గన్ ఫౌండ్రీ, హైదరాబాద్ లో దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు.   మరిన్ని వివరాలకు 040-23236112 నంబర్ లో సంప్రదించాలని తెలిపారు.