సుల్తానాబాద్‌‌లో ఫ్రీ డెంటల్‌‌ క్యాంపు 

సుల్తానాబాద్, వెలుగు : రాష్ట్రంలోని ప్రతీ పీహెచ్‌‌సీలో డెంటల్ డాక్టర్లు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌‌బాబు సూచించారు. తెలంగాణ డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ లో బుధవారం ఏర్పాటుచేసిన ఫ్రీ డెంటల్‌‌ క్యాంపును ఆయన ప్రారంభించారు.

కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు మణిదీప్, ఐపీఎస్ స్కూల్ డైరెక్టర్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపాల్ కృష్ణప్రియ, మున్సిపల్ చైర్‌‌‌‌పర్సన్ గాజుల లక్ష్మి, వైస్ చైర్ పర్సన్ బిరుదు సమత, కౌన్సిలర్ డి. రాజయ్య, డాక్టర్లు శ్రీజ, మహాలక్ష్మి, విగ్నేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.