
- టెన్త్ స్టూడెంట్లకు ఫ్రీగా డివిటల్ కంటెంట్ మెటీరియల్పంపిణీ
- ఇంగ్లిష్, తెలుగు మీడియంకు సపరేట్గా పుస్తకాలు
- క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఫోన్లోకి సబ్జెక్ట్‌కు సంబంధించిన వివరాలు
- ఈజీగా అర్థం అవుతుంటడంతో స్టూడెంట్లలో పురుగుతున్న ఇంట్రెస్ట్
మహబూబ్‌నగర్, వెలుగు : గవర్నమెంట్ స్కూల్స్‌లో టెన్త్ చదువుతున్న స్టూడెంట్లకు మెరుగైన విద్యను అందించేందుకు ఎమ్మెల్యేలు చర్యలు తీసుకుంటున్నారు. ప్రొజెక్టర్లు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ (ఐఎఫ్‌పీ, డిజిటల్ బోర్డు) అందుబాటులో ఉన్న గవర్నెమెంట్ స్కూల్స్‌లో కొద్ది రోజుల నుంచి డిజిటల్ కంటెంట్ క్లాసులు ప్రారంభం అయ్యాయి. ఐఎఫ్‌పీ ప్యానల్స్ అందుబాటులో ఉన్న స్కూల్స్‌లో పెన్ డ్రైవ్ ద్వారా డిజిటల్ కంటెంట్ సాఫ్ట్ వేర్‌ను డౌన్ లోడ్ చేశారు.
ప్రతి రోజూ ఉదయం తొమ్మిదిన్నర నుంచి 11 గంటల వరకు ఆయా సబ్జెక్టులకు సంబంధించిన డిజిటల్ కంటెంట్‌ను బోధిస్తున్నారు. లాంగ్వేజ్ సబ్జెక్టులను మినహాయించి మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజి, సోషల్ సజెక్టులను చాప్టర్లా వారీగా చెబుతున్నారు. డిజిటల్ కంటెంట్‌లో పెద్ద పెద్ద డయాగ్రామ్స్, చార్టులు డిస్ప్లే అవుతుండటంతో స్టూడెంట్లు వాటిని ఈజీగా అర్థం చేసుకుంటున్నారు.
ఈ క్లాసెస్ చెప్పడం కోసం నెలన్నర కిందట హైదరాబాద్ నుంచి వచ్చిన స్పెషలిస్టులతో ఎమ్మెల్యే యెన్నం గవర్నమెంట్ టీచర్లకు ట్రైనింగ్ నిర్వహించారు. ట్రైనింగ్ పొందిన టీచర్లు వారి స్కూల్స్‌లో ఉన్న ఇతర టీచర్లకు డిజిటల్ కంటెంట్ క్లాసులపై శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు సబ్జెక్టుల వారీగా టీచర్లు వారి క్లాసెస్ చెబుతున్నారు.
ఎమ్మెల్యేల కృషి
మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తన సొంత డబ్బులతో గతేడాది నుంచి గవర్నమెంట్ స్కూల్స్‌లో టెన్త్‌కు ప్రీపేర్ అవుతున్న వారికి ఫ్రీగా డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్‌ను అందజేశారు. నిరుడు వెలువడిన టెన్త్ ఫలితాల్లో డిజిటల్ కంటెంట్ అందించిన స్కూల్స్‌లో మెరుగైన రిజల్ట్స్ రావడంతో ఈ ఏడాది కూడా పంపిణీని కంటిన్యూ చేశారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలోని అన్ని గవర్నమెంట్ స్కూల్స్‌లో పంపిణీ పూర్తి కాగా.. మిగిలిన పుస్తకాలను ప్రైవేట్ స్కూల్స్‌లో చదువుకుంటున్న స్టూడెంట్లకు అందిస్తున్నారు.
అయితే యెన్నంను మాదిరిగానే దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కూడా గవర్నమెంట్ స్కూల్స్‌లో చదువుతున్న స్టూడెంట్లకు గత నెల రోజుల నుంచి ఫ్రీగా డిజిటల్ కంటెంట్ పుస్తకాలను అందజేస్తున్నారు. వారు కూడా తమ సొంత డబ్బును ఖర్చు చేసి పుస్తకాలను ప్రింటింగ్ చేయిస్తున్నారు.
నాలుగు రకాల పుస్తకాలు
డిజిటల్ బోర్డులు, ప్రొజెక్టర్లు లేని స్కూల్స్‌లో మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, సోషల్ సబ్జెక్టులకు సంబంధించిన డిజిటల్ కంటెంట్ పుస్తకాలను టెన్త్ స్టూడెంట్లకు అందజేస్తున్నారు. ఇంగ్లిష్ మీడియం చదువుతున్న వారికి ఇంగ్లిష్‌లో, తెలుగు మీడియం చదువుతున్న వారికి తెలుగులో ఈ పుస్తకాలను ఇచ్చారు.
ఈ మెటీరియల్ ద్వారా స్టూడెంట్లు ఎప్పుడైనా, ఎక్కడైనా ఆయా సబ్జెక్టులను చదువుకోవచ్చు. పుస్తకాల్లో ఉండే క్యూ ఆర్ కోడ్‌ను ఫోన్ ద్వారా స్కాన్ చేస్తే ఆ సబ్జెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారం ఫోన్లో ఓపెన్ అవుతుంది. ఆ సబ్జెక్టుకు సంబంధించిన అదనపు సమాచారం కూడా అందులో ఉంటుంది. వాటి ఉపోద్ఘాతాలు, వివరణలు కూడా ఉంటాయి. దీంతో ఇంట్రెస్ట్‌గా పిల్లలు చదువుకుంటున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో గత మూడేళ్ల టెన్త్ రిజల్ట్స్
ఏడాది మొత్తం స్టూడెంట్లు పాస్
2021-22 13,083 11,575 88.47
2022-23 12,503 8,909 71.25
2023-24 12,673 11,338 89.47
ఫోన్ ద్వారా వింటున్నా..
ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. డిజిటల్ కంటెంట్ బుక్స్ ఇవ్వడంతో ఇంటికి వెళ్లాక ఫోన్ ద్వారా క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి క్లాసెస్ వింటున్నా. స్కూల్లో కూడా మార్నింగ్ డిజిటల్ కంటెంట్ క్లాసెస్ వింటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే ఇంటికి వెళ్లాక మరోసారి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డౌట్ క్లియర్ చేసుకుంటున్నా. ఎగ్జామ్స్ ముందు ఈ కంటెంట్ చాలా ఉపయోగకరంగా ఉంది.
- అమ్రిన్ తబస్సుం, టెన్త్ క్లాస్, గాంధీ రోడ్ హైస్కూల్, మహబూబ్‌నగర్
మా స్కూల్లో కూడా డిజిటల్ క్లాసులు చెబుతుండ్రు
ప్రైవేట్ స్కూల్స్‌లోనే డిజిటల్ క్లాసులు ఉంటాయని విన్నా. కాని ఇప్పుడు మా స్కూల్లో కూడా డిజిటల్ క్లాసులు జరుగుతున్నాయి. నేను కూడా ఆ క్లాసెస్‌ను వింటున్నా. చూస్తున్నా. టెన్త్ ఎగ్జామ్స్ టైంలో ఈ కంటెంట్ ఇవ్వడం వల్ల సబ్జెక్ట్ చాలా ఈజీగా అర్థం అవుతోంది. థ్యాంక్స్ ఎమ్మెల్యే యెన్నం సార్. కె.భార్గవి, టెన్త్ క్లాస్, గాంధీ రోడ్ హైస్కూల్, మహబూబ్‌నగర్