కరీంనగర్ టౌన్, వెలుగు: గతంలో 50 యూనిట్లు వరకు విద్యుత్ వినియోగించే ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు100 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ను వినియోగించొచ్చని ట్రైనీ కలెక్టర్ డా.నికోలస్ ప్రకటనలో తెలిపారు. ఆయా వ్యక్తులు తమ కుల ధ్రువీకరణ పత్రాలను ఎన్పీడీసీఎల్ ఆఫీస్ లో సమర్పించాలని వివరించారు. 50 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే కుటుంబాల సంఖ్య తగ్గిపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.
-