
కొలంబో: విమెన్స్ టీ20 ఆసియా కప్‌లో టీమిండియా–పాకిస్తాన్ హై ఓల్టేజ్ మ్యాచ్‌కు ప్రేక్షకులను ఉచితంగా స్టేడియంలోకి అనుమతిస్తామని ఆతిథ్య శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. టోర్నీ ఆరంభ రోజైన ఈ నెల 19న డంబుల్లాలో ఆతిథ్య శ్రీలంక– బంగ్లాదేశ్ మధ్య తొలి పోరు తర్వాత ఈ మెగా మ్యాచ్ జరగనుంది.
ఈ టోర్నీలో హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీలోని ఇండియా గ్రూప్–ఎలో పాకిస్తాన్, యూఏఈ, నేపాల్‌తో కలిసి బరిలోకి దిగనుంది. గ్రూప్–బిలో బంగ్లాదేశ్, శ్రీలంక, మలేసియా, థాయ్‌లాండ్ ఉన్నాయి. ఫైనల్, సెమీఫైనల్స్ సహా మొత్తం 15 మ్యాచ్‌లకు ఫ్యాన్స్‌కు ఉచిత ప్రవేశం కల్పిస్తామని లంక బోర్డు తెలిపింది.