
వంగూరు, వెలుగు: ఈ నెల 19 నుంచి 26 వరకు వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో శంకర నేత్రాలయ (ఎంఈఎస్ యూ), హైదరాబాద్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ కమిషన్ మెంబర్ కేవీఎన్ రెడ్డి తెలిపారు. శిబిరం వాల్ పోస్టర్ ను గురువారం విడుదల చేశారు.
సీఎం తల్లిదండ్రులు ఎనుముల నరసింహారెడ్డి, రామచంద్రమ్మ జ్ఞాపకార్థం గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహిస్తున్న కంటి వైద్య శిబిరాన్ని మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిబిరానికి వచ్చే పేషెంట్లకు వారం రోజుల పాటు భోజన వసతి కల్పించనున్నట్లు తెలిపారు. పులిజాల కృష్ణారెడ్డి, ఎనుముల వేమారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వెంకటయ్య యాదవ్, అనిల్, జంగయ్య, ముత్యాలరెడ్డి పాల్గొన్నారు