మునుగోడులో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

మునుగోడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి  ఫౌండేషన్  సౌజన్యంతో   ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చాలామంది కంటి సమస్యలతో బాధపడుతూ సొంత పనులు చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

  వృద్ధులకు అవగాహన లేకపోవడం..  సమయానికి చికిత్స అందకపోవడం వల్ల కంటి సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. అటువంటి వారికి కనుచూపు మెరుగయ్యేంతవరకు తన  నియోజకవర్గ ప్రజలకు  మెగా ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. మొదటి ఉచిత కంటి వైద్య శిబిరంలో1000 నుండి 1200 మంది వరకు   వైద్యం చేయించుకునేల ఏర్పాటు చేశామన్నారు. 

Also Read :- తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్ ఇస్తాం

 మునుగోడు నియోజకవర్గంలోని ఏడు మండలాలు .. రెండు మున్సిపాలిటీలలో ప్రతి నెల ఒకటి చొప్పున  ఈ ఉచిత మెగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు.    ఉచిత మెగా కంటి వైద్య శిబిరాలలో  కంటి సమస్యలు ఉన్నవాళ్లు వైద్యం చేయించుకోవాలని  నియోజకవర్గం ప్రజలను కోరారు.