ఇల్లెందు పట్టణంలో పోలీస్​ కుటుంబాలకు ఉచిత కంటి పరీక్షలు

ఇల్లెందు పట్టణంలో పోలీస్​ కుటుంబాలకు ఉచిత కంటి పరీక్షలు

ఇల్లెందు, వెలుగు: ఖమ్మం శరత్ మ్యాక్స్ విజన్ కంటి వైద్యశాల ఆధ్వర్యంలో శుక్రవారం ఇల్లెందు పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్​లో ఇల్లెందు సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబసభ్యులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. డీఎస్పీ చంద్రభాను మాట్లాడుతూ.. కంటి సమస్యలున్న వారికి శరత్ మాక్స్ విజన్ హాస్పిటల్ లో ఆపరేషన్​చేస్తారని తెలిపారు. 

దవాఖాన వైద్యులను సీఐ సత్యనారాయణతో కలిసి సన్మానించారు.  టేకులపల్లి, గుండాల సీఐలు సురేశ్, రవీందర్, సబ్ డివిజన్ ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.