
వంగూరు,వెలుగు: కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి తల్లిదండ్రులు ఎనుముల నరసింహారెడ్డి, రామచంద్రమ్మ జ్ఞాపకార్థం హైదరాబాద్ లోని శంకర నేత్రాలయ సహకారంతో శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.
కంటి సమస్య ఉన్న వారికి ఉచితంగా వైద్యం అందించేందుకు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు మాజీ ఉప సర్పంచ్ ఎనుముల వేమారెడ్డి, రాజశేఖర్ రెడ్డి తెలిపారు. 380 మంది కంటి పరీక్షలు చేయించుకోగా 30 మందికి కంటి ఆపరేషన్లు చేసినట్లు వైద్యులు తెలిపారు.