కొండారెడ్డిపల్లిలో కంటి వైద్య శిబిరం

కొండారెడ్డిపల్లిలో కంటి వైద్య శిబిరం

వంగూరు, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో శనివారం ఉచిత కంటి వైద్యశిబిరాన్ని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు కేవీఎన్.రెడ్డి సీఎం సోదరుడు గ్రామ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ ఎనుముల కృష్ణారెడ్డితో కలిసి ప్రారంభించారు. సీఎం తల్లిదండ్రులు ఎనుముల నరసింహారెడ్డి, రామచంద్రమ్మల జ్ఞాపకార్థం కుటుంబసభ్యులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 10 రోజులపాటు కొనసాగుతుందని, వంగూరు మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.