నిజాంపేట, వెలుగు : మండల పరిధిలోని రాంపూర్ లో శుక్రవారం స్వామి వివేకానంద యువజన సంఘం, ఆర్వీఎం హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 95 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో 27 మందికి ఆపరేషన్లు అవసరమని డాక్టర్లు నిర్ధారించినట్లు
వివేకానంద యూత్ వ్యవస్థాపకుడు, ప్రముఖ సంఘ సేవకుడు తమ్మలి రమేశ్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్ వీఎం హాస్పిటల్ డాక్టర్లు అపూర్వ, సంధ్య, అస్రఫ్, మార్కెటింగ్ మేనేజర్ లక్ష్మణ్, పీఆర్ వో సంతోష్ కుమార్ పాల్గొన్నారు.