164 వారాలుగా అన్నదానం

164 వారాలుగా అన్నదానం

ఆదర్శంగా నిలుస్తున్న  స్కై ఫౌండేషన్

హైదరాబాద్​, వెలుగు:ఎవరైనా ఒకరోజో ..రెండు రోజులో లేదా నెలలో ఒక రోజు పెట్టుకుని రోడ్డు పక్కన అనాథలకు ఫుడ్​ ప్రొవైడ్​ చేస్తుంటారు. కానీ 164 వారాలుగా కంటిన్యూగా అన్నదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు స్కై ఫౌండేషన్ ​సభ్యులు. తాము చేస్తున్న బిజినెస్​, ఉద్యోగాల నుంచి వస్తున్న జీతాల్లోంచి కొంత అభాగ్యుల కోసం వెచ్చిస్తున్నారు. ఈ ఆదివారం కూడా ముషీరాబాద్ నుంచి ప్రారంభించి  కవాడిగూడ, ట్యాంక్ బండ్, బేగంపేట్, అమీర్ పేట, పారడైజ్, సంగీత్,  సికింద్రాబాద్, మెట్టుగూడ, తార్నాక, చిక్కడపల్లి, హిమాయత్ నగర్  పరిసర ప్రాంతాలలో రోడ్ల పక్కన ఆకలితో అలమటిస్తున వారికి  పుడ్​ ప్యాకెట్లు అందజేశారు. కరోనా రూల్స్​ పాటిస్తూనే అన్నదానం చేశారు.  ఫౌండేషన్​ ప్రెసిడెంట్​ డా.వై. సంజీవ్​కుమార్​,  వైస్ ప్రెసిడెంట్  ఓ.పావని,  సభ్యులు పి.నందిని, పాల్గొన్నారు.