కోటగిరిలో ఉచిత వైద్య శిబిరం

కోటగిరిలో ఉచిత వైద్య శిబిరం

కోటగిరి, వెలుగు: అభయహస్తం ఫౌండేషన్ సంజీవని హాస్పిటల్ ఆధ్వర్యంలో  కోటగిరిలోని ఎస్సీ కాలనీలో శుక్రవారం ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహించారు.  డాక్టర్ ఇంతియాజ్ బేగం రోగులకు పరీక్షలు నిర్వహించగా  అభయహస్తం సొసైటీ ద్వారా ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

355  మంది హెల్త్  చెకప్ చేసుకొని మందులను తీసుకున్నారని నిర్వాహకులు తెలిపారు.  ఉచిత ఆరోగ్య శిబిరాలు పేదలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయని నిర్వాహకులు బర్ల మధు తెలిపారు.  అభయహస్తం అధినేత బర్ల మధుకర్, సంజీవనీ హాస్పిటల్ నిర్వాహకులు ప్రభాకర్, సాయిలు, మిర్జాపూర్ సాయన్న తదితరులు పాల్గొన్నారు.