
షాద్ నగర్, వెలుగు: పట్టణంలోని ఏబీవీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ ఆనంద్ కుమార్, డాక్టర్ భార్గవి ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఉచిత గుండె పరీక్షలను నిర్వహించారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అతిథిగా హాజరై మాట్లాడారు.
ఆరోగ్యం పై నిర్లక్ష్యం చేయకుండా పనులపై తిరిగే వారి కోసం ఏబీవీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం అండగా నిలబడడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు ఎండీ ఖాజాపాషా, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.