బ్రెస్ట్, సర్వికల్​ క్యాన్సర్లపై అవగాహన పెరగాలి : సినీ నటి మీనాక్షి చౌదరి

బ్రెస్ట్, సర్వికల్​ క్యాన్సర్లపై అవగాహన పెరగాలి : సినీ నటి మీనాక్షి చౌదరి
  • నెలాఖరు వరకు కొనసాగనున్న ఉచిత వ్యాక్సినేషన్ డ్రైవ్

హైదరాబాద్​సిటీ, వెలుగు: అపోలో క్యాన్సర్ సెంటర్స్, క్యూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం జూబ్లీహిల్స్ అపోలో క్యాన్సర్​సెంటర్​లో ఉచిత వ్యాక్సినేషన్​ డ్రైవ్ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా సినీ నటి మీనాక్షి చౌదరి పాల్గొని ప్రారంభించారు.  ఆమె మాట్లాడుతూ.. మహిళలకు బ్రెస్ట్, సర్వికల్ క్యాన్సర్​పై అవగాహన అవసరమన్నారు. ఇవి నయం చేయదగినవే అయినప్పటికీ అవగాహనా లోపంతో ప్రాణాంతకంగా మారుతున్నాయన్నారు. డాక్టర్లు, క్యూర్ వంటి ఫౌండేషన్లు మహిళల్లోని అపోహలు తొలగిస్తూనే, క్యాన్సర్లపై అవగాహన పెంచాలని కోరారు. 

.అపోలో క్యాన్సర్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ విజయ్ ఆనంద్ రెడ్డి మాట్లాడుతూ ప్రారంభ దశలోనే క్యాన్సర్​ను గుర్తిస్తే ఈజీగా నయం చేయొచ్చన్నారు. రాబోయే రోజుల్లో క్యాన్సర్ సాధారణ వ్యాధిగా మారే అవకాశం ఉందన్నారు. హెచ్​పీవీ వ్యాక్సిన్ ద్వారా లివర్, సర్వికల్ క్యాన్సర్లను నివారించవచ్చన్నారు. ప్రభుత్వమే ఉచితంగా ఈ వ్యాక్సిన్​ను అందించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. 

మహిళలు అత్యధికంగా బ్రెస్ట్, సర్వికల్ ​క్యాన్సర్ల బారిన పడుతున్నారని చెప్పారు. డాక్టర్లు పద్మజా లోకిరెడ్డి, రాజీవ్ రెడ్డి, ఎస్వీఎస్ఎస్ ప్రసాద్ పాల్గొన్నారు. వరల్డ్​క్యాన్సర్​డే సందర్భంగా ఈ ఫ్రీ డ్రైవ్​ను ప్రారంభించగా, నెలాఖరు వరకు కొనసాగనుంది. జూబ్లీహిల్స్​ అపోలోలో ప్రతిరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మహిళలకు ఉచితంగా హెచ్​పీవీ వ్యాక్సిన్లు వేయనున్నారు. మొదటిరోజైన సోమవారం150 మంది అనాథ బాలికలకు వ్యాక్సిన్ ఇచ్చారు.