వనపర్తి, వెలుగు: ఉచిత న్యాయ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత సూచించారు. బుధవారం వనపర్తిలో బాలల న్యాయస్థానంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ ను ప్రారంభించి మాట్లాడారు. బాలల న్యాయస్థానంలో ప్రత్యేకంగా మైనర్ల కోసం ఉచిత న్యాయ సేవలను అందించేందుకు ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.
వనపర్తిలో ప్రతి బుధవారం బాలల న్యాయస్థానం కొనసాగిస్తున్నట్లు చెప్పారు. బాలల న్యాయస్థానం జడ్జిగా వై జానకి వ్యవహరిస్తారు. గిరిజా ప్రీతి, రాజేశ్వర్, డేగల కృష్ణయ్య, శ్రీనివాస్ రెడ్డి, మదిలేట్టి, బాల నాగయ్య, కె ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.