జగిత్యాల పట్టణంలో పిల్లల కోసం ఉచిత వైద్య శిబిరం

జగిత్యాల టౌన్, వెలుగు : పట్టణంలోని అర్జున్ పిల్లల హాస్పిటల్ ఆధ్వర్యంలో జగిత్యాల రూరల్ చల్ గల్ సర్పంచ్ గంగనర్సు, డాక్టర్ గుండేటి అర్జున్ పిల్లల ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. 150 మంది పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. పిల్లల తల్లిదండ్రులకు వర్షాకాలంలో వచ్చే రోగాల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు వెంకటేశ్​, డాక్టర్ ధనంజయ, ప్రవీణ్, గణేశ్​, హాస్పిటల్స్ సిబ్బంది, గ్రామప్రజలు తదితరులు పాల్గొన్నారు.