తొగుట, వెలుగు: మారుమూల గ్రామాల్లో వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి వారికి మెరుగైన చికిత్స అందిస్తామని సామాజిక సమరసత రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ అన్నారు. ఆదివారం గోవర్ధన గిరి, ముత్యంపేటలో ఆరు విభాగాల డాక్టర్లను పిలిపించి వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ.. కంటిచూపుతో ఇబ్బందిపడే వారికి కంటి అద్దాలను అందజేస్తామని తెలిపారు.
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారిని హాస్పిటల్లో చేర్పించి మెరుగైన వైద్యం అందిస్తామని పేర్కొన్నారు. అనంతరం ముత్యంపేట్ గ్రామం నుంచి వేరే గ్రామాలకు ఉన్నత చదువుల కోసం నడుచుకుంటూ వెళ్లే పేద స్టూడెంట్స్కు సైకిళ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్లు శిరీష, అరుణ్, సందీప్, సాయినాథ్ రెడ్డి, సమరసత ప్రతినిధులు సంతోష్, యాదగిరి, రాజశేఖర్ రెడ్డి, రుక్మిణి పాల్గొన్నారు.