
మనోహరాబాద్, వెలుగు: మండల పరిధిలోని కొండాపూర్ లో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ, వీఎస్టీ ఇండస్ట్రీ ఆధ్వర్యంలోశుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మల్లారెడ్డి హాస్పిటల్ ప్రత్యేక వైద్య బృందం రోగులకు వివిధ రకాల పరీక్షలు చేసి, మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఇందులో 166 మంది రోగులు పరీక్షలు చేయించుకోగా శిబిరాన్ని డిప్యూటీ డీఎంహెచ్వో జ్ఞానేశ్వర్, సీహెచ్వో బాల నర్సయ్య సందర్శించారు.
డాక్టర్లు మణికంఠ, ఖ్యాతి, సంజన, రాకేశ్, సాయి కిరణ్, యశస్విని వైద్య పరీక్షలు చేశారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీనివాసరావు, యాదగిరి, డీజీ శర్మ, దామోదర్ రావు, చంద్రబోస్, శ్రీను, సత్యం, సతీశ్ ఉన్నారు.