![చౌటపల్లిలో ఉచిత వైద్య శిబిరం](https://static.v6velugu.com/uploads/2025/02/free-medical-camp-organized-in-chautapalli-village_vRKEGBM29h.jpg)
మఠంపల్లి, వెలుగు : మైహోం సిమెంట్ పరిశ్రమ ఆధ్వర్యంలో మఠంపల్లి మండలం చౌటపల్లి గ్రామంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు.
అంతకుముందు టీబీ వ్యాధిపై అవగాహన కల్పించారు. 850 మంది క్యాంపునకు తరలివచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం లో ప్రజాప్రతినిధులు వెంకటనారాయణ, నరేశ్,సైదులు, రామిరెడ్డి, లింగయ్య, కార్యదర్శి వెంకటేశ్వర్లు, సంస్థ జీఎం నాగేశ్వర్ రావు, ఏజీఎంలు నరేశ్, శ్రీనివాస్, హెల్త్ ఆఫీసర్ శ్రీను పాల్గొన్నారు.