అరుంధతి హాస్పిటల్​లో ఉచిత వైద్య సేవలు : మర్రి రాజశేఖర్ రెడ్డి

అరుంధతి హాస్పిటల్​లో ఉచిత వైద్య సేవలు : మర్రి రాజశేఖర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: గండిమైసమ్మ రోడ్​లోని అరుంధతి హాస్పిటల్​లో ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు హాస్పిటల్ ఫౌండర్, బీఆర్ఎస్ మల్కాజిగిరి సెగ్మెంట్ ఇన్​చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. మంత్రి కేటీఆర్ నినాదం ‘గిఫ్ట్ ఎ స్మైల్’ స్ఫూర్తితో అరుంధతి హాస్పిటల్​లో పూర్తి ఉచితంగా వైద్యసాయాన్ని అందిస్తున్నామన్నారు. ఇప్పటివరకు దాదాపు 2 వేలకుపైగా సర్జరీలు నిర్వహించామన్నారు.

కొత్తగా ఏర్పాటు చేసిన కార్డియాలజీ విభాగంలో ఉచితంగా ఈసీజీ, 2డీ ఎకో, క్యాత్ ల్యాబ్ టెస్టులు చేసుకునే అవకాశం కల్పించామన్నారు. ఎంతో ఖర్చుతో కూడిన ఎంఆర్ఐ, సీటీ స్కాన్, అల్ట్రా సౌండ్ స్కానింగ్, ఎక్స్ రే, ఎండోస్కొపీ, డయాలసిస్​తో పాటు 24 గంటలు సూపర్ స్పెషాలిటీ సేవలను ఉచితంగా అందిస్తున్నట్లు ఆయన చెప్పారు.