కాశీబుగ్గ, వెలుగు : వరంగల్ సిటీ ములుగు రోడ్డులోని అజర హాస్పిటల్‌లో సోమవారం నుంచి 17వ తేదీ వరకు ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు హాస్పిటల్ ఎండీ డాక్టర్బి.శివసుబ్రమణ్యం తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ క్యాంప్‌లో బ్లడ్, యూరిన్, గుండ్, షుగర్, బీపీ టెస్టులు చేయనున్నట్లు చెప్పారు.
అలాగే రూ.6,999లకే పూర్తి బాడీ చెకప్ టెస్ట్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఉచిత వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.