ఆర్టీసీ ఉద్యోగుల జీవిత భాగస్వాములకు మెడికల్ టెస్టులు : ఎండీ సజ్జనార్  

ఆర్టీసీ ఉద్యోగుల జీవిత భాగస్వాములకు మెడికల్ టెస్టులు : ఎండీ సజ్జనార్  

హైదరాబాద్,వెలుగు:  గ్రాండ్ హెల్త్ చాలెంజ్​లో భాగంగా  ప్రతి ఆర్టీసీ ఉద్యోగితో పాటు వారి జీవిత భాగస్వామికి కూడా ఫ్రీ మెడికల్ టెస్టులు నిర్వహించాలని నిర్ణయించిందని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఆగస్టులో ఉద్యోగుల హెల్త్ ప్రొఫైల్స్ రూపొందించేలా ప్లాన్‌‌ చేస్తున్నామన్నారు. ఆర్టీసీ కళాభవన్​లో మంగళవారం రాష్ట్రస్థాయి హెల్త్ వలంటీర్ల సమావేశానికి ఆయన చీఫ్​ గెస్ట్​గా హాజరై మాట్లాడారు. మొదటి చాలెంజ్ లో అద్దె బస్సు డ్రైవర్లతో సహా 47 వేల మంది సంస్థ సిబ్బందికి, రెండో చాలెంజ్ లో 45 వేల మంది ఉద్యోగులకు మెడికల్ టెస్టులు నిర్వహించినట్టు వెల్లడించారు.

ALSO READ :  స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ. 3,442 కోట్లు

 

ఇందులో కీలకపాత్ర పోషించిన డాక్టర్లు, హెల్త్‌‌ వలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. తీవ్రమైన గుండె సంబంధిత సమస్యలతో బాధపడే 450 మంది ఉద్యోగుల ప్రాణాలను సంస్థ కాపాడగలిగిందని చెప్పారు.  ఇక నుంచి ప్రతి ఏటా గ్రాండ్ హెల్త్ చాలెంజ్ నిర్వహించాలని సంస్థ భావిస్తుందని చెప్పారు.  ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు తార్నాక ఆర్టీసీ దవాఖానకు సూపర్‌‌ స్పెషాలిటీగా తీర్చిదిద్దామన్నారు. గ్రాండ్ హెల్త్ చాలెంజ్-– 2 అమలులో అత్యుత్తమ పనితీరు చూపిన హెల్త్ వలంటీర్లను సన్మానించారు.