సూర్యగూడ పోలీసుల ఆధ్వర్యంలో మెగా మెడికల్‌ క్యాంప్‌

గుడిహత్నూర్, వెలుగు: ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఆదిలాబాద్​ జిల్లా అడిషనల్‌ఎస్పీ బి.సురేందర్‌ రావు, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ నరేందర్‌ రాథోడ్‌ అన్నారు. గుడిహత్నూర్ ​మండలంలోని సూర్యగూడలో పోలీసుల ఆధ్వర్యంలో గురువారం ఉచిత మెగా మెడికల్‌ క్యాంప్‌ నిర్వహించారు. క్యాప్​ను ప్రారంభించిన అడిషనల్ ఎస్పీ, డీఎంహెచ్​ఓ మాట్లాడుతూ.. మారుమూల గ్రామాల ప్రజల కోసం ఉచితంగా మెడికల్‌ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

మద్యం, పొగాకుతో ఆరోగ్యాన్ని పాడుచేసుకోవద్దని, పిల్లలను బాగా చదివించి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు. అనారోగ్య సమస్యలు వస్తే నాటు వైద్యం చేసుకోకుండా ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో ఉట్నూర్‌, వర్టికల్‌, సైబర్‌క్రైం డీఎస్పీలు నాగేందర్, పోతారం శ్రీనివాస్, హసీబుల్లా, ఇచ్చోడ సీఐ భీమేశ్, ఎస్​ఐలు ఇమ్రాన్‌ సయ్యద్, సునీల్, శ్రీకాంత్, రిమ్స్‌ డాక్టర్లు అభిజిత్, శ్యాం, ప్రీతల్, రాజు తదితరులు పాల్గొన్నారు.