
సంగారెడ్డి టౌన్, వెలుగు : సంగారెడ్డి పట్టణంలోని వెల్నెస్హాస్పిటల్స్ ఈనెల 31 వరకు మహిళలకు ఉచిత ఓపీ సేవలు అందిస్తున్నట్లు హాస్పిటల్ ఎండీ లాలేన్స్, గైనిక్ స్పెషలిస్ట్ ఆలియా రూహి తెలిపారు. శనివారం వారు మీడియాతో మాట్లాడుతూ.. మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం, కుటుంబం బాగుంటాయన్నారు.
పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల మహిళలు హాస్పిటల్అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6: 00 వరకు ఓపీ సేవలు అందిస్తామని చెప్పారు.