
చిట్యాల, వెలుగు: పేదల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. పెద్దకాపర్తిలో, చిట్యాల మున్సిపాలిటీలో బుధవారం ఉచిత సన్నబియ్యం పంపిణీ చేశారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ బియ్యం తీసుకోవాలని సూచించారు. చిట్యాల తహసీల్దార్ కృష్ణ నాయక్, చిట్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, నాయకులు జడల చిన్న మల్లయ్య, కాటం వెంకటేశం, ఏనుగు రఘుమా రెడ్డి పాల్గొన్నారు.
నార్కట్‌పల్లి, వెలుగు: నార్కెట్‌పల్లి పట్టణంలోని రేషన్ షాపులో ఎమ్మెల్యే వీరేశం సన్న బియ్యం పంపిణీ చేశారు. మండల ప్రత్యేక అధికారి చరిత, కాంగ్రెస్‌మండల అధ్యక్షుడు బత్తుల ఉషయ్య గౌడ్, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు భూపాల్ రెడ్డి తదితరులున్నారు.
కడుపు నిండా అన్నం పెట్టే పథకం
హుజూర్ నగర్, వెలుగు: సన్న బియ్యం పథకం పేదలకు కడుపు నిండా అన్నం పెట్టే పథకమని మున్సిపల్ మాజీ చైర్మన్ గెల్లి అర్చన రవి, టీపీసీసీ జాయింట్ సెక్రటరీ ఎండీ.అజీజ్ పాషా అన్నారు. బుధవారం హుజూర్ నగర్ లో రాష్ట్ర సివిల్సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. నాయకులు అమరబోయిన సతీశ్, సమ్మెట సుబ్బరాజు, పాశం రామరాజు తదితరులున్నారు.
లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి
మునగాల, వెలుగు : సన్న బియ్యం పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొప్పుల జైపాల్‌రెడ్డి కోరారు. బుధవారం కలకోవలో బియ్యం పంపిణీ చేశారు.
రేషన్ బియ్యం అక్రమ రవాణకు చెక్
మిర్యాలగూడ, వెలుగు: సన్నబియ్యం పంపిణీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆకలి తీర్చడమే కాకుండా రేషన్‌బియ్యం అక్రమ రవాణాకు చెక్పెట్టిందని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ అన్నారు. బుధవారం దామరచర్ల మండలంలోని వాడపల్లి, అడవిదేవులపల్లి మండల కేంద్రంలో, మిర్యాలగూడ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ, బాపూజీ నగర్ లో సన్న బియ్యం పంపిణీ చేశారు. సబ్‌కలెక్టర్ నారాయణ్ అమిత్, కాంగ్రెస్ నాయకులు స్కైలాబ్ నాయక్, పొదిల శ్రీనివాస్ నివాస్, నూకల వేణుగోపాల్ రెడ్డి, సైదులు, బాలు, నాగలక్ష్మి ఉన్నారు.
నల్గొండలోని 30 వ వార్డులో..
నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండలోని 30 వ వార్డు రేషన్ షాప్ లో మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి సన్నబియ్యం పంపిణీని ప్రారంభించారు. ఆర్డీవో అశోక్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ నవీన్ కుమార్ గౌడ్, తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పారేపల్లి నాగరాజు, వైద్యుల సత్యనారాయణ పాల్గొన్నారు.
సన్న బియ్యం.. చరిత్రాత్మకం
హాలియా, వెలుగు: సన్న బియ్యం పథకం చరిత్రాత్మకమని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు. బుధవారం తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలో బియ్యం పంపిణీ చేశారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. కొత్త రేషన్ కార్డుల కోసం మీ -సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని, రైతులు సన్న ధాన్యమే పండించాలని సూచించారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, తిరుమలగిరి సాగర్ స్పెషల్ఆఫీసర్, ఏపీడీ శారద, మాజీ జడ్పీటీసీ లింగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శేఖర్ రెడ్డి, వైస్ చైర్మన్ శేఖర్, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, నాయకులు కృష్ణనాయక్, శ్రీనివాస్ ఉన్నారు.