ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సన్నబియ్యం సంబరాలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సన్నబియ్యం సంబరాలు
  • ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ
  • రేషన్ దుకాణాల వద్ద ఎమ్మెల్యేలు, నాయకుల సందడి

వెలుగు, నెట్ వర్క్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పంపిణీ చేస్తున్న సన్నబియ్యం పథకాన్ని మంగళవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అట్టహాసంగా ప్రారంభించారు.  మక్తల్​ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ..  గతంలో రేషన్​ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్న దొడ్డు బియ్యాన్ని పేదలు తినలేక అమ్ముకునేవారన్నారు.  సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పేదలకు సన్న బియ్యం పంపీణీ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు.  ధన్వాడ, దామరగిద్ద, నారాయణపేట, మరికల్ మండలాల రేషన్ షాపుల్లో సన్నబియ్యాన్ని నారాయణపేట ఎమ్మెల్యే  పర్ణికా రెడ్డి  ప్రారంభించారు.

 పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించడం చారిత్రాత్మక నిర్ణయమని ఆమనగల్లు మార్కెట్ చైర్మన్ యాట గీత చెప్పారు. మంగళవారం తలకొండపల్లి, కడ్తాల్ మండలాల్లోని రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ఏఎంసీ  చైర్మన్ భాస్కర్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్ గౌడ్, బిక్యా నాయక్,యాట నరసింహ, ప్రభాకర్ రెడ్డి, బిచ్చ నాయక్, జగన్ తదితరులు పాల్గొన్నారు.