1,500 మందికి ఉచితంగా స్లీప్ ​కంపెనీ ప్రొడక్టులు

1,500 మందికి ఉచితంగా స్లీప్ ​కంపెనీ ప్రొడక్టులు

హైదరాబాద్, వెలుగు: కంఫర్ట్-టెక్ బ్రాండ్, ది స్లీప్ కంపెనీ 2024 ఆగస్టు 31న దాదాపు రూ. 25 లక్షల విలువైన 100 ఉచిత పరుపులను  హైదరాబాద్ నివాసితులకు ఇచ్చినట్టు తెలిపింది. స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రిడ్ టెక్నాలజీ వల్ల ఇవి మరింత సౌకర్యంగా ఉంటాయని తెలిపింది.  ఈ ఆఫర్ సమయంలో తమ స్టోర్లను సందర్శించిన వారికి ఉచిత దిండ్లను కూడా అందించామని, ఎక్కువ మంది ప్రజలకు తమ ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని స్లీప్​ కంపెనీ తెలిపింది.

 జూబ్లీహిల్స్, కోకాపేట్, కొండాపూర్,  కార్ఖానా స్టోర్లలో వీటిని ఇచ్చారు.  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే కాకుండా ముంబై, చెన్నై,  ఢిల్లీ-–ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సిఆర్ సహా ఇతర మెట్రో నగరాల్లో కూడా ఉచితంగా పరుపులను పంచారు.