తలసేమియా బాధితులకు ఉచితంగా టెస్టులు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల గవర్నమెంట్​జనరల్​హాస్పిటల్​లోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకులో చికిత్స పొందుతున్న తలసేమియా, సికిల్​సెల్​బాధితులకు ఈ నెల 29న ఉచితంగా బోన్​మారో టెస్టు నిర్వహించనున్నట్టు ఐఆర్​సీఎస్​జిల్లా చైర్మన్​ కంకణాల భాస్కర్​రెడ్డి తెలిపారు. 

ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్  ఉమ్మడి జిల్లాలకు చెందిన బాధితులతో పాటు వారి తోబుట్టువులకు, తల్లిదండ్రులకు బెంగళూరుకు చెందిన సంకల్ప్ ఫౌండేషన్ సహకారంతో టెస్టులు నిర్వహించనున్నట్లు చెప్పారు. 18 సంవత్సరాలలోపు వారు ఈ నెల 23 నుంచి 27 లోపు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు తలసేమియా, సికిల్ సెల్ ఇన్​చార్జి కాసర్ల శ్రీనివాస్ (9849643083)ను సంప్రదించాలని సూచించారు.