
భద్రాచలం, వెలుగు: భద్రాచలంలోని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రంలో తలసేమియా, సికిల్‌సెల్ ఎనీమియా నిర్ధారణ కోసం శుక్రవారం ఉచిత రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ ప్రారంభించారు. రూ.5 లక్షల విలువైన వ్యాధి నిర్ధారణ కిట్లను ఐటీసీ పీఎస్పీడీ అందించిందని తెలిపారు.
జిల్లాలో తలసేమియా, సికిల్‌సెల్ ఎనీమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామన్నారు. సొసైటీ జిల్లా కో –ఆర్డినేటర్ ఎస్ఎల్.కాంతారావు, వై.సూర్యనారాయణ, జి.రాజిరెడ్డి, వి.కామేశ్వరరావు, గోళ్ల భూపతిరావు, జి.సంజీవరావు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.