తిరుమల శ్రీవారి దర్శనానికి తిరుపతిలో ఉచిత టోకెన్లు ఇస్తున్నారు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసము, గోవిందరాజ స్వామి సత్రాల దగ్గర సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తున్నారు. ఆధార్ కార్డు ఆధారంగా రోజుకు 15వేల ఉచిత టోకెన్లు ఇవ్వనున్నారు. ఇవాళ టోకెన్ తీసుకున్నవారికి రేపటి నుంచి దర్శనానికి టీటీడీ అనుమతించనుంది. ప్రతి గంటకు 1500 మందికి ఉచిత టోకెన్లను కేటాయిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. టికెట్ల కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఉత్తరాది నుంచి వేలాదిగా శ్రీవారి భక్తులు వచ్చారు.
మరిన్ని వార్తల కోసం