నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

ఆసిఫాబాద్, వెలుగు: జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులకు ఎస్సీ కార్పొరేషన్​ ఆధ్వర్యంలో గ్రూప్స్, ఎస్​ఎస్​సీ, ఆర్ ఆర్ బీ, బ్యాంకింగ్, ఎస్ఐ, కానిస్టేబుల్ తదితర పోటీ పరీక్షలకు 3 నెలల ఉచిత శిక్షణ (స్పెషల్ ఫౌండేషన్ కోర్స్) ఇవ్వనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సజీవన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16 వరకు కాగజ్ నగర్ లోని సాయి తేజ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్​లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు కుల, ఆదాయ, విద్యార్హత, ఆధార్ కార్డు జిరాక్స్​లతో పాటు 2 పాస్​పోర్ట్​ సైజ్ ఫోటోలతో అడ్మిషన్లకు హాజరుకావాలని సూచించారు. డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తామన్నారు. ఎంపికైన వారికి వసతితో కూడిన ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. మరిన్ని వివరాలకు 9985274060, 8247299217 నెంబర్లను సంప్రదించవచ్చన్నారు.