ములుగు, వెలుగు : హైదరాబాద్ క్రికెట్అసోసియేషన్సహకారంతో వేసవిలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నామని, క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ధనసరి సూర్య, జై హనుమాన్ క్రికెట్ క్లబ్ కార్యదర్శి, హెచ్ సీఏ సభ్యులు లక్ష్మణ్ బాబు ఆదివారం ఓ ప్రకటనలో సూచించారు. జిల్లా కేంద్రంలోని తంగేడు స్టేడియంలో ఈ నెల 20 నుంచి సమ్మర్ క్రికెట్ ఫ్రీ క్యాంప్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
అండర్ 16, 19, అండర్ 23, పురుష, మహిళా క్రీడాకారులకు కోచ్ పైడిమల్ల సందీష్ నేత్ర శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 18లోపు https://www.hycricket.org/data-2024-25/summer-camp-apr-2024/sc-regn-inactive.html లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు.