బషీర్ బాగ్, వెలుగు: భాషా, తెలంగాణ సాంస్కృతిక శాఖ, రాష్ట్ర ప్రభుత్వం, సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ సంయక్తాధ్వర్యంలో ఉచితంగా ఫొటోగ్రఫీ డిప్లొమా కోర్సు నిర్వహిస్తున్నామని అకాడమీ చైర్మన్ ఎం.సి.శేఖర్ వెల్లడించారు. ఫొటోగ్రఫీపై ఇంట్రస్ట్ఉండి, ఉపాధి మార్గంగా చేసుకోవానుకునేవారు వినియోగించుకోవాలని సూచించారు.
కోర్సు(ఆఫ్‌లైన్/ఆన్లైన్) ఆరు నెలలు ఉంటుందని చెప్పారు. బేసిక్ఫొటోగ్రఫీతోపాటు వెడ్డింగ్, ఇండస్ట్రియల్, ఫ్యాషన్, పిక్టోరియల్ షూటింగ్ నైపుణ్యాలు, కంపొజిషన్, లైటింగ్, ఫ్రేమ్మింగ్ పై శిక్షణ ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇప్పటికే రెండు బ్యాచ్ లలో దాదాపు 600 మంది యువతకు ఉచిత ఫొటోగ్రఫీ డిప్లొమా కోర్సు అందిస్తున్నామని, మూడో బ్యాచ్‌కు డిసెంబర్ 28 నుంచి క్లాసులు మొదలవుతాయని వెల్లడించారు.
ఆసక్తిగలవారు 80080 21075/70956 92175లో సంప్రదించాలన్నారు. https://sapindia.org/didloma-course లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరని సూచించారు. రిజిస్ట్రేషన్లకు డిసెంబర్ 20 ఆఖరు తేదీ అని శేఖర్తెలిపారు.