యూపీలో మహిళా కార్మికులకు కొత్త రూల్స్

యూపీలో మహిళా కార్మికులకు కొత్త రూల్స్

పని ప్రదేశాల్లో మహిళా కార్మికులకు సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు యూపీలోని యోగి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కర్మాగారాల్లో మహిళా కార్మికులెవ్వరూ నైట్ షిప్ట్ చేయకూడదని తెలిపింది. ఒక వేళ విధులకు హాజరు అయితే వారి నుంచి లిఖిత పూర్వకంగా  అనుమతి  తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.ఏ మహిళా కార్మికురాలు తన అనుమతి లేకుండా ఉదయం 6 గంటల ముందు రాత్రి 7 గంటల తర్వాత పని చేయకూడదని పేర్కొంది. పైన పేర్కొన్న సమయాల్లో పనిచేైస్తే వారికి ఉచిత రవాణా, ఆహారం, వారికి తగినంత పర్యవేక్షణ కల్పించాలని సూచించింది. అంతేకాదు ఉదయం 6 గంటలలోపు సాయంత్రం 7 గంటల తర్వాత పనిచేయడానికి మహిళా కార్మికులు నిరాకరిస్తే వారిని ఉద్యోగం నుంచి తొలగించకూడదని యూపీ కార్మికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 7 గంటల తర్వాత విధులకు వెళ్లాలని ఒత్తిడి చేయరాదని స్పష్టం చేసింది. పని ప్రదేశంలో లైంగిక వేధింపుల సంఘటనలను నిరోధించడానికి మహిళా కార్మికులకు సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించే బాధ్యత యజమానిపై ఉండాలని తెలిపింది.

మరిన్ని వార్తల కోసం

ఏడాది చివరి నాటికి కొత్త పంబన్ వంతెన పూర్తి

శ్రీలంకలో 50 రోజులుగా కొనసాగుతున్న నిరసనలు