
పంజాగుట్ట, వెలుగు: గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారులకు ఈ నెల 22 నుంచి 28 వరకు హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్‌లో ఫ్రీగా ఆపరేషన్లు చేయనున్నట్లు హాస్పిటల్ డైరెక్టర్ నగరి బీరప్ప చెప్పారు. యూకేలో స్థిరపడిన డాక్టర్ దన్నపునేని ఆధ్వర్యంలోని చికిత్స అందించనున్నట్లు తెలిపారు. పీడియాట్రిక్ రమణ ప్రతి సంవత్సరం వారం రోజుల పాటు నిమ్స్ కార్డియోథొరాసిక్ హెడ్ ప్రొఫెసర్ అమరేశ్వర్‌రావు, సీనియర్ డాక్టర్ గోపాల్‌తో కలిసి చిన్నారులకు వైద్య సేవలు అందిస్తారన్నారు. గుండె సమస్యలున్న చిన్నారులు కార్డియోథొరాసిక్ డాక్టర్లను సంప్రదించాలని సూచించారు.