పంజాగుట్ట,వెలుగు : నిమ్స్ఆస్పత్రిలో అత్యాధునిక వాటర్ ఏటీఎంను ప్రారంభించారు. సేఫ్వాటర్ నెట్ వర్క్ ఇండియా స్వచ్ఛంద సంస్థ , నిమ్స్సౌజన్యంతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వాటర్ ఏటీఎంను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. శుక్రవారం నిమ్స్ డైరెక్టర్డాక్టర్ నగరి బీరప్ప ఏటీఎంను ప్రారంభించి మాట్లాడారు.
జీరో వేస్టేజ్టెక్నాలజీతో నాణ్యమైన తాగునీటిని పేషెంట్లు, సహాయకులకు అందించేందుకు 24 గంటలు అందుబాటులో ఉంటుందని చెప్పారు. అసిస్టెంట్మెడికల్సూపరింటెండెంట్డాక్టర్ చరణ్, డాక్టర్సల్మాన్, మీడియా రిలేషన్ అధికారి సత్యగౌడ్, సేఫ్ వాటర్నెట్ వర్క్ ఇండియా హెడ్ఆఫ్ఆపరేషన్శంకర్లాల్ బత్రా,మల్లికార్జున్ ,శ్రీకాంత్, జితేందర్ ఉన్నారు.