ఉచితాలు కావాలో.. రోడ్లు, డ్రైనేజీలు, నీళ్ల సరఫరా లాంటి సౌకర్యాలు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని 16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగరియా అన్నారు. గురువారం (9 జనవరి) గోవాలో మంత్రులు, కమిషన్ సభ్యులతో జరిగిన సమావేశం అనంతరం దేశంలో వివిధ ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత పథకాలపై ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రాలు నిధులను ఉచితాలకు వాడుకోవడం సరైనదేనా అన్న ప్రశ్నకు.. రాష్ట్రాలకు ప్రాజెక్టులు, సౌకర్యాల కోసం నిధులు ఇస్తు్న్నామని.. కానీ ఉచిత పథకాలకే ఎక్కువ ఖర్చు చేస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో నిధులు ఎలా ఖర్చుపెట్టాలో ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని అన్నారు.
ALSO READ | సంక్రాంతి కానుక : బ్రౌన్ రైస్, షుగర్ ఓకే.. డబ్బులు ఇస్తారా.. ఇవ్వరా..?
ప్రజా సమస్యలు, అవసరాలు, ఆర్థిక పరిస్థితులపై ఫైనాన్స్ కమిషన్ సలహాలు, సూచనలు చేస్తుందని, అయితే ఎలా ఖర్చు పెట్టాలో రాష్ట్ర ప్రభుత్వాలను కంట్రోల్ చేయలేమని తెలిపారు. ప్రజలు ప్రభుత్వ ఉచితాల కోసం ఓట్లేస్తే ఉచితాలే కోరుకుంటారని, అలా కాకుండా మంచి రోడ్లు రవాణా, డ్రైనేజీ, నీళ్లు తదితర సౌకర్యాలు కావాలో వద్దో వారే నిర్ణయించుకోవాలని అన్నారు.
ప్రభుత్వాలు ప్రజలను ఉచిత పథకాల పేరున ఆశచూపిస్తాయని.. కానీ అభివృద్ధి, సౌకర్యాలు కావాలో, ఉచిత పథకాలతో అకౌంట్లలోకి డబ్బులు రావాలో ప్రజలే డిసైడ్ చేసుకోవాలని సూచించారు..