తెలియని ఏరియాకు ఎక్కడికి వెళ్లాలన్నా ఇప్పుడు అందరికీ గుర్తొచ్చేది గూగుల్ మ్యాప్స్. అయితే గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్ముకొని వెళితో ఒక్కోసారి గమ్యం అగమ్యగోచరం అనే పరిస్థితులు చాలా మందికి ఎదురయ్యాయి. అలాంటి ఘటనే ఇప్పుడు ఫ్రెంచ్ టూరిస్టులకు ఎదురయ్యింది. వివరాల్లోకి వెళ్తే..
ఫ్రెంచ్ టూరిస్టులు నేపాల్ వెళ్లాలనని 2025, జనవరి 7న సైకిల్ యాత్ర ప్రారంభించారు. ఢిల్లీ నుంచి ఫ్రెంచ్ వెళ్లేందుకు షార్ట్ కట్ కోసం గూగుల్ మ్యాప్ పై ఆధారపడ్డారు. చూపించిన దారి వెంట వెళ్లిన టూరిస్టులు అర్ధరాత్రి ఉత్తరప్రదేశ్ లోని ఓ చురైలి డ్యామ్ దగ్గర చిక్కుకుపోయారు.
టూరిస్టులను గమనించిన గ్రామస్తులు వివరాలు కనుక్కుని.. వాళ్ల నిజంగా టూరిస్టులా కాదా అనే అనుమానంతో బరేలీ జిల్లాలోని చురైలీ పోలీస్ ఔట్ పోస్ట్ వద్దకు తీసుకెళ్లారు. పోలీసులు వివరాలు అడిగి ఆ రాత్రి చురైలి గ్రామ పెద్ద ఇంట్లో ఆశ్రయం కల్పించారు.
ALSO READ | Republic Day Parade 2025: రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్.. ఇండియా గేట్ పరేడ్ వెనుక..
‘‘బ్రయాన్ జాక్వెస్ గిల్బర్ట్, సెబాస్టియన్ ఫ్రాంకోయిస్ గ్యాబ్రియెల్ అనే ఫ్రెంచ్ టూరిస్టులు ఫిలిభిత్ నుంచి తనక్ పూర్ మీదుగా నేపాల్ లోని కాఠ్మండు వెళ్లేందుకు ప్రయాణమయ్యారు. గూగుల్ మ్యాప్స్ బరేలీలోని బహేరీ మీదుగా షార్ట్ కట్ దారిని చూపించింది. మ్యాప్ చూపించిన ఇసుక దారి వెంట వెళ్లీ చివరికి చురైల్ డ్యామ్ వద్ద చిక్కుకున్నారు. గ్రామస్తులకు భాష అర్థం కాకపోవడంతో కాస్త వాగ్వాదం జరిగింది. చివరికి పోలీస్ ఔట్ పోస్ట్ కు తీసుకొచ్చారు. మేము వివరాలు తెలుసుకొని ఆ రాత్రి అదే గ్రామంలో వసతి ఏర్పాటు చేశాం’’ అని పోలీసులు చెప్పారు. సీనియర్ పోలీస్ ఆఫీసర్ అనురాగ్ ఆర్య ఆదేశాల ప్రకారం పోలీసులు ఫ్రెంచ్ టూరిస్టులకు దారి చూపించి నేపాల్ కు పంపించారు.
తెలియని దారిలో వెళ్లేందుకు గూగుల్ మాప్స్ ఉపయోగపడతాయి కావచ్చు.. కానీ కొన్ని సార్లు ఎక్కడికో తీసుకెళ్లి టైమ్ వేస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవలే గూగుల్ మ్యాప్ ను నమ్ముకుని కారులో వెళ్లిన జంట.. సగం పూర్తైన బ్రిడ్జీ మీది నుంచి పడిపోయిన విషయం తెలిసిందే. అందుకే మ్యాప్ వేసుకుని వెళ్లే సమయంలో కాస్త అప్రమత్తంగా ఉండటం మంచిది. అవసరం అయితే ఎవరినైనా అడిగా దారిని కన్ఫమ్ చేసుకోవడం బెటర్.