
బర్మింగ్‌హామ్ : ఫ్రెంచ్ ఓపెన్‌లో రెండోసారి టైటిల్ నెగ్గి జోష్‌లో ఉన్న ఇండియా డబుల్స్ స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ పై గురి పెట్టారు. మంగళవారం మొదలయ్యే ఈ మెగా టోర్నీ మెన్స్ డబుల్స్‌లో ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నారు. ఇక గాయం నుంచి కోలుకుని ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్స్ వరకు వచ్చిన పీవీ సింధు కూడా టైటిల్‌తో తిరిగి ఫామ్ అందుకోవాలని చూస్తోంది. ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్‌లో పోరాడి ఓడిన లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్ ప్రణయ్, ప్రియాన్షు రజావత్ మెన్స్ సింగిల్స్‌లో బరిలో నిలిచారు. విమెన్స్ డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రీసా జాలీ, అశ్విని పొన్నప్ప–తనీషా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.