
పారిస్ : డిఫెండింగ్ చాంపియన్, పోలెండ్ స్టార్ ప్లేయర్ ఇగా స్వైటెక్.. వరుసగా మూడోసారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన విమెన్స్ సింగిల్స్ సెమీస్‌లో టాప్‌సీడ్ స్వైటెక్ 6–2, 6–4తో కోకో గాఫ్ (అమెరికా)పై గెలిచింది. దీంతో క్లే కోర్టుపై తన వరుస విజయాల రికార్డు (19)ను మరింత మెరుగుపర్చుకుంది. మరో మ్యాచ్‌లో జాస్మిన్ పౌలిని (ఇటలీ)6–3, 6–1తో మిరా ఆండ్రీవా (రష్యా)పై నెగ్గి స్వైటెక్‌తో టైటిల్ ఫైట్‌కు రెడీ అయ్యింది.
ఇక మెన్స్ సింగిల్స్ క్వార్టర్స్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–4, 7–6 (7/5), 6–4తో అలెక్స్ డి మినుర్ (ఆస్ట్రేలియా)పై గెలిచాడు. డబుల్స్ సెమీస్‌లో రెండో సీడ్ రోహన్ బోపన్న– మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) 5–7, 6–2, 2–6తో 11వ సీడ్ సిమోన్ బోలెలి–ఆండ్రియా వావసోరి (ఇటలీ) చేతిలో ఓడాడు.